కేవలం 1500 మందితో కదిలిన రథయాత్ర..

- June 23, 2020 , by Maagulf
కేవలం 1500 మందితో కదిలిన రథయాత్ర..

లక్షలాది మంది జనం, ఎంతో వైభవంగా జరగాల్సిన జగన్నాథస్వామి రథయాత్ర బోసిపోయి కనిపించింది. దాదాపు 10 లక్షల మందితో ముందుకు సాగే రథచక్రాలు కేవలం 1500 మందితోనే కదిలాయి. కరోనా దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ యాత్రను ప్రారంభించారు. ఒక్కో రథానికి 500 మంది చొప్పున మూడు రథాలను లాగారు. ఇసుక వేస్తే రాలనంత జనాలతో కనిపించాల్సిన ఆలయ వీధులు బోసిపోయి కనిపించాయి.

ఎప్పటిలాగే కైంకర్యాలను సంప్రదాయ బద్ధంగా పూర్తి చేశారు. జగన్నాథ, సుభద్ర, బలభద్ర దేవతా మూర్తులను అలంకరించి రథాలపై ప్రతిష్టించారు. పూరీ రాజు బంగారు చీపురు పట్టుకుని రథాల ముందు ఊడ్చి, స్వామికి సేవలు నిర్వహించారు. ఆ తర్వాత రథాలను పూజారులు, వాలంటీర్లు అతి కొద్ది మంది భక్తులు మాత్రమే పాల్గొన్నారు. అయితే భక్తులు ఈ కార్యక్రమాన్నిఇంటి నుంచే చూసేలా ప్రత్యక్ష ప్రసారాలను చేశారు. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ఇంతటి సాధాసీదాగా కార్యక్రమం జరిగింది. భక్తులు రాకుండా ఉండేందుకు ఒడిశా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ప్రజా రవాణాను నిలిపివేశారు. పూరీ ప్రాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. అంతకు ముందే ఆలయ ప్రాంగంణంలో శానిటైజేషన్‌ ప్రక్రియను చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ రథాలను లాగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com