రియాద్: ప్రైవేట్ రంగంలో కరోనా కల్లోలం..ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి భారీగా వినతులు
- June 24, 2020
రియాద్:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియాలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తమ సంస్థలు నిలదొక్కుకొని మనుగడ కొనసాగించాలంటే..తమకు ఆర్ధిక మద్దతు ఇవ్వాలంటూ ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇబ్బడిముబ్బడిగా వినతులు వచ్చిపడుతున్నాయి. కరోనా మహమ్మారి విరుచుకుపడిన తర్వాత మార్చి రెండో వారం నుంచి జూన్ రెండో వారం వరకు ప్రైవేట్ రంగంలోని వివిధ సంస్థల నుంచి దాదాపు 95 వేల వినతులు వచ్చినట్లు ఫైనాన్షియల్ అఫైర్స్ లోని అకౌంట్ విభాగం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన వినతుల విలువ SR 47 బిలియన్లని తెలిపింది. అంటే ప్రతి రోజు సగటున SR 522 మిలియన్ల మేర ఆర్ధిక మద్దతు కోరుతూ వినతులు వస్తున్నాయని వివరించింది.
కింగ్ డమ్ విజన్ 2030లో భాగంగా దేశ ఆర్ధిక అభివృద్ధికి దోహదం చేసే ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం కొన్నేళ్లు తగిన తోడ్పాటు అందిస్తోందిని ఈ సందర్భంగా ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఆర్ధిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ రంగానికి తగిన మద్దతు అందిస్తామని వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా అందిరికీ తగిన సాయం అందిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..