మస్కట్:వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట..కొత్త ప్యాకేజీ నేటి నుంచి అమలు
- June 24, 2020
మస్కట్:కరోనాతో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఫోకస్ చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇందులోభాగంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరటనిచ్చేలా వాటి కార్యకలాపాలకు అవసరమైన కొత్త ప్యాకేజీని నేటి నుంచి అమలు చేయబోతోంది. అయితే ప్యాకేజీ వివరాలు, అమలుకు అవసరమైన పరిస్థితులపై సంబంధిత అధికారులు నేడు ప్రకటించనున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అధ్యక్షతన ఇప్పటికే సమావేశమైంది. దేశంలో కరోనా తీవ్రత..వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించింది. ఈ సందర్భంగానే వాణిజ్య, పారిశ్రామిక రంగాల కార్యాకలాపాలకు సంబంధించి ప్యాకేజీ అమలుపై కూడా చర్చించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







