కువైట్:విదేశీ కార్మికులకు షాక్..ఆయిల్ సెక్టార్ లో 500 మంది నిలిపివేత
- June 25, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభం భయపెడుతున్న వేళ కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందుకోసం విదేశీ కార్మికులను పనులను నుంచి పక్కకు తప్పిస్తోంది. కువైట్ అయిల్ రంగంలో దాదాపు 500 మంది కార్మికులను పనిని పక్కకు తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీయులకు ఉపాధిని నియంత్రిస్తూ ఆయా రంగాల్లో దేశ పౌరులకు అవకాశం కల్పించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..దేశ పౌరుల కంటే విదేశాల నుంచి ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గరిష్టంగా ఉంటోందన్నది కువైట్ వాదన. దేశంలో ఉపాధి విషయంలో సమతుల్యత పాటించేందుకు విదేశీయులకు నిర్ణీత కోటా విధానాన్ని అవలంభించాలని చట్టసభ్యులు ఇప్పటికే ఓ ముసాయిదా తీర్మానాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్న వారిలో చాలా మంది నైపుణ్యం లేని వారే ఉంటున్నారని, అలాగే ప్రస్తుత కరోనా సంక్షోభంలో వారు దేశీయ ఆరోగ్య వసతులపై కూడా ప్రభావం చూపిస్తున్నారన్నది కువైట్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కువైట్ ఆయిల్ రంగంలోని దాదాపు 500 మంది కార్మికుల కాంట్రాక్ట్ ను నిలిపివేసింది. ప్రస్తుతం నిలిపివేసిన 500 మందితో గతేడాదే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా..అది కరోనా సంక్షోభానికి ముందు తీసుకున్న నిర్ణమని చమురు శాఖ మంత్రి వెల్లడించారు. అంతేకాక..కేంద్ర అడ్జుకేషన్ కమిటి ఇంకా ఈ కాంట్రాక్ట్ ను ఆమోదించలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..