కోవిడ్ 19: యూఏఈలో స్టెరిలైజేషన్ పూర్తి..జనసంచారంపై నిషేధం ఎత్తివేత

- June 25, 2020 , by Maagulf
కోవిడ్ 19: యూఏఈలో స్టెరిలైజేషన్ పూర్తి..జనసంచారంపై నిషేధం ఎత్తివేత

యూఏఈ:కరోనా వైరస్ కట్టడి కోసం యూఏఈ చేపట్టిన జాతీయ స్టెరిలైజేషన్ (క్రిమిసంహారక చర్య) డ్రైవ్ బుధవారంతో ముగిసింది. దీంతో జనసంచారంపై నిషేధాన్ని ఎత్తివేసింది ప్రభుత్వం. ఇక నుంచి ప్రజలు బయట తిరగొచ్చని, అయితే...కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని ప్రకటించింది. అంతేకాదు..12 ఏళ్లలోపు పిల్లలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లొద్దనే ఆంక్షలను కూడా సడలించింది. ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజులు వేసుకోవాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది ప్రభుత్వం. వీలైనంత వరకు విహార యాత్రలు, ఇతర పర్యటనలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని..తప్పనిసరైతేనే ప్రయాణాలు చేయాలని సూచించింది. కార్లలో ప్రయాణించే వారు ముగ్గురికి మించి ఉండకూడదని కూడా వెల్లడించింది. ఇదిలాఉంటే..నేషనల్ స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి కావటంతో దుబాయ్ లో కూడా జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ ప్రకటించింది. కమిటి సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ప్రజలు ఏ సమయంలోనైనా స్వేచ్ఛగా బయట తిరగొచ్చని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com