12 ఏళ్ళ లోపు వయసున్నవారికి మాల్స్, ఈటరీస్‌లో ఎంట్రీకి లైన్ క్లియర్
- June 25, 2020
యూఏఈలో 12 ఏళ్ళ లోపు వయసున్న చిన్నారులకు మాల్స్ అలాగే రెస్టారెంట్ల లోకి అనుమతించనున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ క్రౌసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) అధికార ప్రతినిది¸ మాట్లాడుతూ, అన్ని పబ్లిక్ ఫెసిలిటీస్ స్టెరిలైజేషన్ పూర్తయ్యిందనీ, ఇది కొనసాగుతుందనీ చెప్పారు. దుబాయ్ మెట్రోతో సహా అన్ని పబ్లిక్ ఫెసిలిటీస్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా స్టెరిలైజేషన్ చేయడం జరిగిందని అన్నారు. జూన్ 18న దుబాయ్‌లో 12 లోపు చిన్న పిల్లలు, అలాగే వృద్ధుల మూమెంట్‌పై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. కాగా, ఓ కారులో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఈ ముగ్గురు వ్యక్తుల నిబంధన వర్తించదు. మరోపక్క, పబ్లిక్ గేదరింగ్స్‌కి మాత్రం అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







