మస్కట్:సరిహద్దు ద్వారా రాకపోకలకు ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం
- June 26, 2020
మస్కట్:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల మధ్య రహదారి రాకపోకల దిశగా జీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లోని పౌరులు, ప్రవాసీయులు సరిహద్దు ద్వారా ప్రయాణం చేసేందుకు రూపొందించిన ఏకీకృత విధానానికి జీసీసీ ఆమోదం తెలిపింది. అయితే..సరిహద్దులు దాటే సమయంలో ఆయా ప్రయాణికులను ఆరోగ్య పరిస్థితులపై అంచనా వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై, సంరక్షణ ఏర్పాట్లపై సుప్రీం కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉందని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..తమ దేశంలోకి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒమన్ ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా టెస్ట్ రిపోర్ట్ తో రావాలా? వద్దా? అనేది త్వరలోనే నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







