కువైట్:కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 15 మంది కువైతీస్, 3 ప్రవాసీయుల అరెస్ట్
- June 27, 2020
కువైట్:కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే..కొందరు ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కర్ఫ్యూ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. జూన్ 26న మొత్తం 18 మంది కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 15 మంది కువైతీలు ఉండగా..ముగ్గురు ప్రవాసీయులు ఉన్నారు. రాజధాని నగరంలో ఏడుగురు, హవాల్లీలో ఐదుగురు, ముబారక్ అల్ కబీర్ లో ఒకరు, అహ్మదిలో నలుగురు, జహ్రలో ఒకరు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వాళ్లందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..