మహిళా రాయల్ గార్డ్: సౌదీకి గర్వకారణం
- June 27, 2020
రియాద్: సౌదీ రాయల్ గార్డ్‌కి సంబంధించి ఓ మహిళా మెంబర్ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియా యూజర్స్, ‘దేశానికే గర్వకారణం’ అంటూ స్పందిస్తున్నారు. హై ప్రొఫైల్ గవర్నమెంట్ ఆఫీసులో ఓ మహిళా రాయల్ గార్డ్, ఓ పురుష గార్డ్‌తో కలిసి విధులు నిర్వహిస్తుండడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కాగా, 2019 అక్టోబర్‌లో ప్రభుత్వం, మిలిటరీలోకి లాన్స్ కార్పొరల్స్, కార్పొరల్స్, సర్జంట్స్ అలాగే స్టాఫ్ సర్జంట్స్గా నియామకానికి అనుమతులిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. సౌదీ ల్యాండ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, సౌదీ అరేబియన్ నేవీ, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్, స్ట్రేటజిక్ మిస్సైల్ ఫోర్సెస్ అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో మహిళలకు కూడా అవకాశాలు కల్పించారు. పలు రకాల పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా వీరి ఎంపిక జరుగుతోంది. సౌదీ అరేబియా విజన్ 2030లో భాగంగా ఈ ఇనీషియేటివ్‌ని చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?