నటి సంఘవి నేడు పెళ్లి చేసుకోబోతోంది!
- February 02, 2016
ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి బుధవారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. కర్ణాటకకు చెందిన సంఘవి ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను బుధవారం పెళ్లి చేసుకోబోతున్నది. వీరి వివాహం ఉదయం 9 గంటలకు బెంగళూరు ఎంజీ రోడ్డులోని వివాంత తాజ్ హోటల్లో జరుగనుంది. ఉదయం 11 గంటలకు రిసెప్షన్ నిర్వహించనున్నారు. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ.సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా 'అమరావతి' సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించారు. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూకనిపించింది.దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి నాయికగా నటించింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాల్లో అభిమానులను మెప్పించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









