పచ్చిమిర్చి చేపల వేపుడు
- February 02, 2016
కావలసినవి: 300 గ్రాముల చేప, ఒక నిమ్మకాయ,20గ్రాముల అల్లం పేస్టు.20గ్రాముల వెల్లుల్లి పేస్టు, రెండు గ్రాముల వాము, ఐదు పచ్చిమిరపకాయలు,50గ్రాముల ధనియాలు, ఐదు గ్రాముల దానిమ్మ గింజల పొడి, రెండు గ్రాముల నల్ల ఉప్పు, 50 గ్రాముల నీళ్లు వడకట్టిన గట్టిపెరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె, రెండు గ్రాముల జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం
చేపముక్కలను శుభ్రంగా కడిగి నీటిని వడకట్టి అల్లం వెల్లుల్లి పేస్టు,నిమ్మకాయ రసం కలిపి కొంచెంసేపు నానపెట్టుకోవాలి. నూరి ఉంచుకున్న పచ్చిమిరపకాయల ముద్ద,ధనియాల పొడి,దానిమ్మపొడి,వాముని కూడా చేపముక్కలకి పట్టించాలి. చేప ముక్కలని అలాగే రెండుగంటలు నాననివ్వాలి.
ఇక ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగిన తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా చేసిన చేప వేపుడు చూడటానికి పచ్చగా కంటికింపుగా ఉండటమే కాక కొత్తరుచిని మీకందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







