టిక్‌టాక్‌తో పాటు 59 యాప్స్ నిషేదించిన భారత ప్రభుత్వం
- June 29, 2020
న్యూ ఢిల్లీ:చైనీస్ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారత్‌లో 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, వీ చాట్, బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, చైనీస్ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 52 చైనా యాప్స్‌ను నిషేధించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.
జూన్ 15న తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ యత్నిస్తున్నాయి. అయితే అదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్ కూడా ఎల్‌ఏసీ వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. ఎల్‌ఏసీ వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్ నిఘా ఉధృతం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







