దుబాయ్:జులై 5 నుంచి ఫెడరల్ ఉద్యోగులంతా విధులకు హజరుకావాలని ఆదేశాలు
- June 30, 2020
దుబాయ్:ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక నుంచి విధులకు హజరుకావాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. జులై 5న ఉద్యోగలు తమ ఆఫీసులలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే..వారు అధికారిక కమిటీ ఆమోదించిన మెడికల్ రిపోర్ట్స్ ని ఆఫీసులలో సమర్పించాలి. గతంలో కొన్ని వర్గాల వారికి ఆఫీసులకు రాకుండా మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గర్భిణులు, పెద్ద వయస్కులు, 9వ గ్రేడ్ కన్న తక్కువ చదువుతున్న పిల్లల తల్లులకు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ నెల నుంచే 50 శాతం ఉద్యోగులతో సాధారణ సేవలు ప్రారంభించారు. ఇదిలాఉంటే 100 శాతం సిబ్బందితో దుబాయ్ ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 15 నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక షార్జా ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో సేవలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు