జులైలో పెరిగిన ఫ్యూయల్‌ ధరలు

- July 01, 2020 , by Maagulf
జులైలో పెరిగిన ఫ్యూయల్‌ ధరలు

దోహా:ఖతార్‌ పెట్రోలియం, జులై నెలకుగాను పెట్రో ధరల్ని ప్రకటించింది. జూన్‌ నెలతో పోల్చితే, జులై నెలలో పెట్రోల్‌ ధరలు పెరిగాయి. 91 ప్రీమియం గ్యాసోలిన్‌ ధర 10 దిర్హామ్స్ పెరిగింది. గతంలో ఈ ధర 1 ఖతారీ రియాల్‌ వుండగా, ఇప్పుడు అది 1.10 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంది. 95 సూపర్‌ గ్యాసోలిన్‌ ధర 15 దిర్హామ్స్ పెరిగింది. దాంతో 1.05గా జూన్‌లో వున్న ధర ఇప్పుడు 1.20 ఖతారీ రియాల్స్ అయ్యింది. డీజిల్‌ ధరకి అదనంగా 5 దిర్హామ్స్ జోడించారు. ఈ ధర 1.05 నుంచి ప్రస్తుతం 1.10 ఖతారీ రియాల్స్ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com