అందాల ఆకాష్ మళ్లీ నటిస్తున్నాడు!
- July 01, 2020
అసాధారణ విజయం సాధించిన 'ఆనందం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందాల కథానాయకుడు ఆకాష్.. 'వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ' తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు.
కెరీర్ పరంగా ఇటీవల కాస్తంత వెనకబడ్డ ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో..
పూర్వ వైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.ఆకాష్ కన్నడలో నటించిన 'జోతాయి.. జోతాయల్లీ' అనే సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్ తమిళంలో.. 'నీతానై ఎంతన్ పొన్వసంతన్' పేరుతో జీ-తమిళ్ లో డైలీ సీరియల్ గా ప్రసారమవుతూ... తమిళనాట ఆకాష్ పేరు మారుమ్రోగేలా చేస్తోంది. అంతేకాదు.. ఆకాష్ నటించిన అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.
'ఏ-క్యూబ్' పేరుతో ఒక మూవీ యాప్ ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్... 'అందాల రాక్షసుడు'గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు!!
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







