కార్ల ముందు రికార్డింగ్ కమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
- February 03, 2016
ట్రాఫిక్ ఉల్లంఘనల నివారణకు వాహనదారులు తమ తమ కార్ల దేష్ బోర్డుల పై కమెరాలను ఏర్పాటు
చేసుకోనెందుకు యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ఎటువంటి అబ్యంతరాలు లేవని ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్
ఒక ప్రకటనలో తెలిపింది. ఇందు కోసం మొబైల్ ఫోన్లలోని కెమెరాలను ఉపయోగించవచ్చు. వీటిని విండ్
షీల్డ్‌ల పై అమర్చుకోవడం ద్వారా స్వీయ ట్రాఫిక్ నియంత్రణ అవకాశం కలుగుతుందని ఒక ఉన్నతాధికారి
పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా తమ వాహానాన్ని ఎదుటివారి వాహనంకు ' ఢీ ' కొట్టించి
వారితో తగాదా పెట్టుకొని ఆ అర్వాత వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బును వసూలు చేస్తున్నట్లు
తమ దృష్టికి వచ్చినట్లు దుబాయ్ పోలీస్ కౌన్సిల్ ఆధ్యక్షుడు, అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్
జనరల్ మహమ్మద్ సైఫాల్ జాఫీన్ తెలిపారు, ఇటీవల తమ పరిశీలనలో ఒక వ్యక్తి ఒక నెలలో రెండు
వేర్వేరు సంఘటనలో రెండుసార్లు తన వాహనాన్ని కావాలని ముందుకు దూకించినట్లు తాము స్పష్టంగా
గమనించినట్లు ఆయన తెలిపారు ఈ చర్య కేవలం నష్ట పరిహారం కోసమే, ఆ వ్యక్తి ఈ దుశ్చర్యకు
పాల్పడినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ విధంగా ' ఢీ ' కొట్టించిన వ్యక్తి ఆ ప్రమాదంలో ఒకవేళ
మరణించినట్లయితే, ఆ నష్ట పరిహారం డబ్బు తన కుటుంబసభ్యులకు అందిఉండేదని ఆయన చెప్పారు.
ఈ తరహ ఉల్లంఘనలు చోటు చేసుకొంటున్న నేపధ్యంలో కార్ల దేష్ బోర్డుల పై ఉన్న కెమెరాలతో రికార్డు
చేయడం మంచిదని కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ సైఫాల్ జాఫీన్ తెలిపారు. ఈ
కెమెరాల ఏర్పాటు ద్వారా చోరీలకు పాల్పడేవారి వాహనాల నెంబర్ ప్లేట్స్ ను సులువుగా
గుర్తించవచ్చని, అలాగే కారును నిలిపివుంచిన సమయంలో అపరిచిత వ్యక్తులు వాహనం నుంచి ఏదైనా,
అపహరించేందుకు యత్నిస్తే , ఆయా దొంగలు పోలీసులు గుర్తించేందుకు ఉపయోగపడుతుందని
తెలిపారు. దేష్ బోర్డుల పై కమెరాలను ఏర్పాటు వినియోగదారుల గోప్యతను బహిర్గతం చేసేందుకు
ఉద్దేశించినది కాదని కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణకు ఉత్తమ పరిష్కారమని ఆ ఉన్నతాధికారి
వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







