తెలంగాణ:కొత్తగా 1,213 కరోనా కేసులు
- July 02, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 9,069 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 8 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 998 ఉన్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







