కోవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ రంగానికి ఆర్ధిక సాయం కొనసాగించనున్న సౌదీ ప్రభుత్వం
- July 03, 2020
సౌదీ:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను కొనసాగించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్నాళ్లు ప్రైవేట్ రంగానికి అందిస్తున్న ఆర్ధిక సాయాన్ని కొనసాగించనుంది. ప్రైవేట్ సెక్టార్ లోని వేతనాల్లో 60 శాతం జీతాలను భరించేలా నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న నిరుద్యోగభృతి 'సనెద్' పథకం ద్వారా ఈ అర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. అయితే..వ్యాట్ ను మూడింతలు చేసిన మరుసటి రోజే ఉద్దీపన చర్యలకు సంబంధించి ప్రకటన వెలువడటం గమనార్హం. 15 శాతం అమలు చేయటం వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగానికి ఆర్ధిక తోడ్పాటు అందించేలా నిర్ణయించింది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు