జూలై 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు : డీజీసీఏ

జూలై 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు : డీజీసీఏ

న్యూఢిల్లీ: కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదు.

Back to Top