బస్సును ఢీకొట్టిన రైలు, 29 మంది సిక్కు యాత్రికులు మృతి
- July 03, 2020
పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 29 మంది సిక్కు యాత్రికులు మరణించారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 35 మంది యాత్రికులు మినీ బస్సులో నంకానా సాహెబ్‌కు వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం గురుద్వారా సచ్చ సౌధాకు వెళ్లారు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టడడంతో బస్సు తునాతునకలయింది. రైలు పట్టాలకు ఇరువైపులా మృతదేహాలు చెల్లా చెదురుగా పడిఉన్నాయి. 19 మంది స్పాట్‌లోనే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 10 మంద మరణించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







