వంగవీటి రంగా గా సురేష్ కొండేటి
- July 04, 2020
దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్న ‘దేవినేని’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో జి.ఎం.ఎన్ ఫిలిమ్స్, ఆర్.టి.ఆర్ ఫిలింస్ సంయుక్తంగా జి.ఎస్.ఆర్.చౌదరి, రామూరాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం వంగవీటి రంగా జయంతి సందర్భంగా వంగవీటి రంగా పాత్ర అ పోషిస్తున్న సురేష్ కొండేటి కి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు.వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని వివరించారు. ఈ సినిమాకి మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి అందించిన రీ-రికార్డింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఫుల్ లెన్త్ గా వంగవీటి రంగా పాత్రల్లో చేస్తున్న సురేష్ కొండేటి క్యారెక్టర్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.ఈ సినిమా త్వరలో థియేటర్లోనే విడుదవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ ఆవుల వెంకటేష్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







