తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు
- July 04, 2020
హైదరాబాద్:తెలంగాణలో శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,850పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22, 312కు చేరింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 288కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1,572 నమోదయ్యాయి. మిగిలిన వాటిలో రంగారెడ్డిలో 92, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్‌లో 31, కరీంనగర్లో 18 కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,342 మంది కరోనా నుంచి కోలుకొని డిశార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసుల ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







