పాక్ విమానాలకు నో ఎంట్రీ చెబుతున్న అమెరికా
- July 10, 2020
పాకిస్థాన్ కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. పాకిస్తాన్ పైలట్లు అంతా నకిలీ సర్టిఫికేట్లతో విమానాలు నడుపుతున్నారనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలలో కరాచీలో పాకిస్తాన్ విమానం ప్రమాదానికి గురై 97 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ జరపగా.. ఆపైలట్లు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగంలో చేరారని తేలింది. దీంతో ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా పాకిస్తాన్ విమానాలను నిషేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగలినట్టైంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు