'రొరి' లో తెలంగాణా ముఖ్యమంత్రి గా కొటాశ్రీనివాసరావు
- July 10, 2020
విలక్షణ నటుడు కొటాశ్రీనివాసరావు వేయని పాత్రలు లేవనే చెప్పాలి.. భారతదేశం లో సుమారు అన్ని భాషల్లో నటించి మెప్పించిన గొప్ప లెజండరి యాక్టర్ ఆయన. గతం లో చాలా చిత్రాల్లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. మరికొన్న పాత్రల్లో అపోజిషన్ లీడర్ గా కనిపించారు. కాని మెట్టమెదటి సారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణా ముఖ్యమంత్రి గా నటించడం విశేషం. ఈరోజు కొటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజపు సందర్బంగా ఈ లుక్ ని రొరి చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రి గా వైవిధ్యమైన పాత్ర లో నటిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్. రామన్న చౌదరి గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మెదటి లుక్ ని ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావటం విశేషం..భీన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







