కువైటేజేషన్ ఎఫెక్ట్..ఈ ఏడాది చివరి నాటికి స్వదేశాలకు 15 లక్షల మంది ప్రవాసీయులు
- July 10, 2020
కువైట్ సిటీ:కరోనా కల్లోలం, కువైటేజేషన్ పాలసీతో ఈ ఏడాది చివరి నాటికి కువైట్ లోని ప్రవాసీయులు భారీ సంఖ్యలో దేశం విడిచి తమ స్వదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది ప్రవాసీయులు కువైట్ వదిలి వెళ్లొచ్చని భావిస్తున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 1,58,031 మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు కువైట్ ప్రకటించింది. ఇందులో భారతీయులు, ఈజిప్టియన్లే ఎక్కువ మంది ఉన్నారు. మార్చి 16 నుంచి జులై 9 వరకు అంటే ఈ 116 రోజుల్లోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు 993 ఫ్లైట్స్ ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించాయి. అయితే..ప్రస్తుతానికి తమ పూర్తిస్థాయి సామర్ధ్యంలో కేవలం 15 శాతం విమానాలను మాత్రమే కువైట్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఆపరేట్ అవుతున్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో విమానాలను ఆపరేట్ చేసే అవకాశాలు ఉండటంతో రెట్టింపు సంఖ్యలో ప్రవాసీయులు తిరిగి వెళ్లిపోతారని కువైట్ అంచనా వేస్తోంది. దీనికితోడు కరోనా సంక్షోభంతో చాలా వరకు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో కువైట్ జనాభా సమతుల్యత లక్ష్యంగా ముసాయిదా తీర్మానం అమలులోకి రాబోతుండటంతో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు