ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం
- July 10, 2020
బాహుబలితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి మన టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండటం విశేషం.
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, వి.ఎఫ్.ఎక్స్‌లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. యస్.వి.ఆర్ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.యస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని యస్.వి.ఆర్ నిర్మిస్తున్నారు.
ఇది వరకు ఆది సాయికుమార్ చేసిన చిత్రాలకు భిన్నంగా కామిక్ టచ్‌తో సాగే చిత్రమిది. మేకర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టారు. పక్కా అందరినీ ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్టర్1 త్వరలోనే ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







