వలసదారుల కోటా బిల్లుపై కువైట్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు
- July 10, 2020
కువైట్ సిటీ:కువైట్ ఫారిన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్‌కి భారత ప్రభుత్వం ‘వలసదారుల కోటా బిల్లు’ విషయమై తమ అభ్యంతరాల్ని వివరించడం జరిగింది. కువైట్‌తో భారత్‌కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఈ నేపథ్యంలో కువైట్‌కి తమ అభ్యంతరాల్ని తెలిపామని ఎంఈఏ అధికార ప్రతినిధి¸ అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్చువల్ ప్రెస్ బ్రీఫింగ్లో ఈ విషయాన్ని అనురాగ్ వెల్లడించారు. కువైట్ నేషనల్ అసెంబ్లీ లీగల్ మరియు లెజిస్లేటివ్ కమిటీ, వలసదారుల కోటా బిల్లుకి సంబంధించిన డ్రాఫ్ట్‌ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్‌ని వీడాల్సి వుంటుంది. కువైట్ జనాభాలో 15 శాతానికి మించి భారతీయులు వుండడానికి వీల్లేదన్నది ఈ బిల్లు సారాంశం. కువైట్‌లో భారతీయులు అత్యధిక శాతం మంది వున్నారు. కువైట్‌కి సంబంధించి 4.3 మిలియన్ల జనాభాలో భారతీయుల వాటా 1.45గా వుంది. మొత్తంగా వలసదారులు 3 మిలియన్లుగా వున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







