దుబాయ్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 10, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి విశాఖపట్నంకు గల్ఫ్ సేన జనసేన ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్ 172 మందితో విశాఖపట్నం ఈ రోజు క్షేమంగా చేరుకుంది.ఈ ఫ్లైట్ ఏర్పాట్లకు అన్ని విధాలా సహకరించిన,ఇండిగో ఎయిర్లైన్స్ టీం కు,ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాన్సన్ కి సాట ట్రావెల్ ఏజెన్సీ కు,అలాగే APNRTS టీంకు కేసరి త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు.పవన్ కల్యాణ యొక్క సేవాదృక్పదంతో గల్ఫ్ లోని గర్భిణీ స్త్రీలు,ఉపాధి కోల్పోయిన వారు,హెల్త్ ఎమర్జెన్సీ వారికి హెల్ప్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో జనసేన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ వారితో డైరెక్ట్ గా జనసేన టీం మాట్లాడం జరగడం వలన మనకు మార్కెట్ లో కంటే తక్కువ ధరకు టికెట్ దొరికింది.అలాగే గల్ఫ్ సేన జనసేన ఉచితంగా 10 టికెట్స్ మరియు 20 మందికి పూర్తిగా టికెట్ డబ్బులు కట్ట లేకపోయినా వారికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ విమాన ఏర్పాట్లకు సహకరించిన జనసేన మెంబెర్స్ రాజు, గోపాల్,ప్రశాంతి,డాలీ, జాన్ బాబు,అప్పాజీ, స్వామి,శేఖర్ కు త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







