నగదు రహిత లావాదేవీ దిశగా ఖతార్ పూర్వ విద్యార్ధుల ఘనత..కార్మికులకూ ప్రయోజనం

- July 11, 2020 , by Maagulf
నగదు రహిత లావాదేవీ దిశగా ఖతార్ పూర్వ విద్యార్ధుల ఘనత..కార్మికులకూ ప్రయోజనం

దోహా:నగదు రహిత లావాదేవీల నిర్వహణ అంటే కొంత గందరగోళమే. బ్యాంకు అకౌంట్ ఉన్నవారికీ, చదువుకున్నవారికీ, ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ వాలెట్ యాప్స్ పై అవగాహన ఉన్నా...దిగువ తరగతి, కార్మిక వర్గాలకు మాత్రం నగదు రహిత లావాదేవీలపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు. అయితే..ఖతార్ ఫైనాన్స్ కు చెందిన పూర్వ విద్యార్ధులు వలస కార్మికులు, దిగువ తరగతుల వారిని, చివరికి బ్యాంక్ అకౌంట్ లేని వారిని కూడా నగదు రహిత సమాజం వైపు ప్రొత్సహించేలా సరికొత్త ఆవిష్కరణతో విజయం దిశగా పయనిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కూడా కరెన్సీ బదిలీపై భయాందోళన నెలకొంది. కరెన్సీ పేపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తున్న ఘటనలు మనకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ లేని వారికి నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు సీ వ్యాలెట్ ను ఆవిష్కరించారు. ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకున్నా కిరాణా, సెలూన్, పండ్లు, కూరగాయలు వంటి చిన్న చిన్న లావాదేవీలను కూడా సీ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నిజానికి 2019లోనే ఖతార్ ఫైనాన్స్ కు చెందిన పూర్వ విద్యార్ధుల టీమ్ సీ వ్యాలెట్ ను తమ థిసీస్ లో భాగంగా రూపొందించారు. అయితే..దీన్ని మరింత సమర్ధవంతంగా మార్చి ప్రజలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తీవ్రంగా శ్రమించిన వారికి ఖతార్ ఇంక్యూబేషన్ సెంటర్ లో స్టార్ట్ అప్ కంపెనీగా ప్రొత్సహాం దక్కింది. ఖతార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ నుంచి తగిన ఆర్ధిక సాయం కూడా అందింది. దీంతో తమ ఏడుగురు సభ్యుల టీమ్ మరింత పట్టుదలతో సీ వ్యాలెట్ ను డెవలప్ చేసినట్లు సీ వ్యాలెట్ సీఈవో జేవియర్ తెలిపారు. ఇందుకోసం భారత్, ఫిలిప్పీన్స్ తో పాటు పలు దేశాల్లో పర్యటించి అక్కడి నగదు రహిత బదిలీ యాప్ ల పనితీరుపై అధ్యయనం చేశామన్నారు.

పేపర్ కరెన్సీ ద్వారా అంటు వ్యాధుల సంక్రమణకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. దిగువ స్థాయి వర్గాల్లో అవగాహనారిహిత్యం వల్ల వ్యాప్తి తీవ్రత మరింత పెరిగేందుకు ఆస్కారం కూడా ఉంది. ఇది కూడా నగదు రహిత లావాదేవీలను మరింత విస్తరించాలనే కోరికను తమలో పెంచిందని జేవియర్ చెబుతున్నారు. అంతేకాదు..ఖతార్ లో ఇప్పటికే తమ సీ వ్యాలెట్ యాప్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని, ఇప్పటికే కొంత మంది రిటైలర్స్ తో టై అప్ అయినట్లు ఆయన వివరించారు. వ్యాపార వర్గాల్లో టై అప్ అవుతుండటాన్ని కొనసాగిస్తున్నామని కూడా వివరించారు. ఖతార్ లోని ప్రవాస కార్మికులు తమ సీ వ్యాలెట్ ద్వారా ఎంతో రక్షణ ఉంటుందన్నది కూడా జేవీయర్ చెబుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ లేని ప్రవాస కార్మికులు తమ గదుల్లోనే నగదు దాచుకుంటున్నారని అన్నారు. షాపులలో దొరికే స్క్రాచ్ కార్డుల ద్వారా సీ వ్యాలెట్ లో నగదు జమ చేసుకోవచ్చని, అలాగే స్నేహితుల ద్వారా నేరుగా సీ వ్యాలెట్ లోకి నగదు బదిలి చేసుకొని భద్రపరుచుకోవచ్చిని జేవియర్ వివరించారు. ఉద్యోగుల జీతాలను కూడా నేరుగా సీ వ్యాలెట్ లోకి బదిలీ చేసుకొని చిన్న చిన్న చెల్లింపులకు కూడా వినియోగించవచ్చని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com