మస్కట్: సివిల్ స్టేటస్ ఆఫీస్ కు వెళ్లకుండానే ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్స్
- July 11, 2020
మస్కట్:రెసిడెన్సీ కార్డుల రెన్యూవల్ చేసుకోవాలనుకుంటున్న ప్రవాసీయులు పాస్ పోర్ట్, సివిల్ స్టేటస్ డైరెక్టర్ జనరల్ ఆఫీసుకు రానవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవాస ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వేలి ముద్రలు ఇప్పటికే సివిల్ స్టేటస్ ఆఫీసులో స్టోర్ అయి ఉన్నాయని..వాటి ఆధారంగా రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు..రెన్యూవల్ గడువు దాటిన వారికి జరిమానాల నుంచి జులై 15 వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెసిడెన్సీ కార్డు రెన్యూవల్ చేయాలనుకునే వారు ఎలాంటి ఫైన్లు చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదని కూడా సివిల్ స్టేటస్ కార్యాలయ అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..పలు డాక్యుమెంట్ల జారీ కోసం అన్ని గవర్నరేట్లలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మస్కట్ విషయానికి వస్తే అల్ దఖిలియా గవర్నరేట్‌లోని అల్ హమ్రా పోలీస్ స్టేషన్, ధోఫర్ గవర్నరేట్‌లోని మార్ముల్ పోలీస్ స్టేషన్లతో పాటు కొత్తగా అల్ ఖౌద్, అల్ అమెరాట్, మాబెలా, ఖురియాత్ పోలీస్ స్టేషన్లలో సేవా కేంద్రాలను ప్రారంభించింది. ఈ సేవా కేంద్రాల్లో రాయల్ ఒమన్ పోలీస్ నుంచి జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాస్ పోర్ట్ రెన్యూవల్, ఐడీ/రెసిడెన్సీ కార్డులను కలెక్ట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







