తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా పాజిటివ్ కేసులు
- July 12, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,482కు చేరింది.
కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 356కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,883 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8,153 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 6,884మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా GHMCలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







