భారత్ లో కరోనాతో ఒక్కరోజే 500 మంది మృతి
- July 13, 2020
భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 5,53,471 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







