యూఏఈ:గడువు ముగిసిన వీసాలపై స్పష్టత..
- July 13, 2020
యూఏఈ:వీసాల రెన్యూవల్‌పై కీలక ప్రకటన చేసిన యూఏఈ ప్రభుత్వం.వీసాల రెన్యూవల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్‌కు సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ఆదేశించింది. ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ICA) జూలై 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కోసం ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కార్యాలయాల్లో రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICA పేర్కొంది.
ICA వెబ్సైటు లింకు https://www.ica.gov.ae
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







