అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి

- July 13, 2020 , by Maagulf
అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి

మనామా:బహ్రెయిన్‌లో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదం ఓ వలస మహిళను బలితీసుకుంది. ఓ ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, 9 వాహనాలతో సివిల్‌ డిఫెన్స్‌ టీవ్స్‌ు, సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నార్తరన్‌ గవర్నరేట్‌లోని సనాబిస్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ళ మహిళ ప్రాణాలు కోల్పోగా 9 మందిని పోలీసులు రక్షించారు. వీరిలో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. మిగతావారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. మహిళను ఆఫ్రికాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com