ఏ.పీలో కొత్తగా 2,592 కరోనా పాజిటివ్ కేసులు
- July 17, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,646కు చేరుకుంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 837 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు,కృష్ణాలో ఒక్కరు.. మొత్తం 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 534 మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







