యూనివర్సిటీ డిగ్రీ లేని 65 ఏళ్ళ పైబడిన వ్యక్తులకు వర్క్ పర్మిట్ బదిలీ వుండదు
- July 17, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ - లేబర్ సెక్షన్, ప్రైవేట్ సెక్టార్‌కి సంబంధించి వర్క్ పర్మిట్‌ని ఓ కంపెనీ నుంచి మరో కొపెనీకి బదిలీ చేసే విషయంలో 65 ఏళ్ళ పైబడినవారికి వెసులుబాటు లేకుండా చేసింది. అయితే, ఈ విషయమై ఇంకా అధికారిక సర్క్యులర్ రావాల్సి వుంది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా, 65 ఏళ్ళ పైబడిన వ్యక్తులు ఓ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేందుకు వీలుగా వర్క్ పర్మిట్ పొందడానికి ఇకపై వీలుండదు. అయితే, తమ వర్క్ పర్మిట్‌ని పనిచేస్తున్న స్పాన్సర్‌కి సంబంధించి రెన్యువల్ చేసుకోవడానికి వీలు కల్పించనున్నారు. కాగా, 85623 మంది రెసిడెంట్స్ 60 ఏళ్ళ పబడి వున్నారు. ఇందులో 60 నుంచి 54 ఏళ్ళ మధ్య వయసువారు 53814. 64 ఏళ్ళ పైబడినవారు 31,809 మంది వున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?