భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్‌ఇండియా..
- February 04, 2016
భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తోంది. ఎయిర్‌ఇండియా మెనూలో లంచ్, డిన్నర్ తాలి(అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనం)ను చేర్చింది. వీటితో పాటు మసాలాటీనీ అందించబోతోంది. మధ్యాహ్నభోజనం, డిన్నర్ తాలి, మసాలా టీలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్‌ఇండియా గుర్తింపు పొందనుంది. ఈ సోమవారం నుంచి ఈ సేవలను ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ విమానాల్లో ఈ సేవలు అందిస్తున్నామని.. త్వరలో ఇతర మెట్రో సెక్టార్ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







