సౌదీలో చిక్కుకుపోయిన 105 మందిని వెనక్కి రప్పించిన యూఏఈ
- July 18, 2020
షార్జా:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 105 మంది కార్మికుల్ని యూఏఈ ఎయిర్ లిఫ్ట్ చేసింది. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో వారంతా చేరుకున్నారు. ఓసియన్ ఆయిల్ ఫీల్డ్‌లో వీరంతా పనిచేస్తున్నారు. ఆఫ్‌షోర్ ఆన్ షోర్ ప్రాజెక్టుల నిమిత్తం వీరంతా షార్జా ఫ్రీ జోన్లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ అప్రూవల్ తర్వాత ప్రయాణీకుల్ని రీపాట్రియేషన్ చేశారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్, షార్జా పోలీస్ అథారిటీస్ అలాగే ఎయిర్ అరేబియా సంయుక్తంగా ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. 105 మంది తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఓసియన్ ఆయిల్ ఫీల్డ్ ఛైర్మన్ మొహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







