'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ను స్వీకరించిన హీరోయిన్ భూమికా చావ్లా
- July 18, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి డైరెక్టర్ సంపత్ నంది , హీరోయిన్ భూమికా చావ్లాకు ఛాలెంజ్ విసిరారు.
డైరెక్టర్ సంపత్ నంది ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన భూమికా చావ్లా ఈ రోజు తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం భూమికా చావ్లా మాట్లాడుతూ.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని, పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక వెపన్ లా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన అభిమానులందరి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకుపోయేలా.. ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







