మనామా:రెస్టారెంట్లో పేలుడు..10 మందికి గాయాలు
- July 18, 2020
మనామా:మనామా లోని ఓ రెస్టారెంట్లో పేలుడు సంభవించటంతో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లలో ఇద్దరు బహ్రెయిన్ వ్యక్తులు ఉండగా..మిగిలిన ఎనిమిది మంది ఆసియా దేశాలకు చెందిన వారు. రెస్టారెంట్లో గ్యాస్ లీక్ అవటంతో బ్లాస్టింగ్ జరిగినట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బహ్రెయిన్ తూర్పు ప్రాంతంలోని తుబ్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







