అరేబియా సముద్రంలో అల్పపీడనం..ఓమన్ లోని పలు ప్రాంతాల్లో వర్ష సూచన
- July 18, 2020
ఓమన్:అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఓమన్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఓమన్ మెట్రలాజి డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అరేబియా సముద్రం మీదుగా కదులుతున్న మేఘాలు దక్షిణ షార్కియా, అల్ వుస్టా, మస్కట్, దక్షిణ అల్ బటినాతో పాటు అల్ బటినా యొక్క ఉత్తర తీరంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నాయని వెల్లడించింది. అలాగే పశ్చిమ హజార్ పర్వతాలలో అల్ బురైమి, అల్ ధహిరా ప్రాంతాల్లో విస్తరించిన మేఘాల కారణంగా ఉరుములతో కూడిన వర్షం కురువొచ్చని తెలిపింది. జులై 17 నుంచి 20 వరకు అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని, ఈదురుగాలుల కారణంగా ఇసుక తెన్నెల ప్రాంతాల్లో భారీగా దుమ్ము, ఇసుకతో కూడిన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







