దోహా లో అనారోగ్య కారణంగా మృతి చెందిన ఏ.పి వాసి
- July 18, 2020
#APNRTS #మరియు #వైఎస్ఆర్సీపీ #వారి #సహకారంతో #స్వస్థలానికి #మృతదేహం .
#వైఎస్ఆర్సీపీ #గల్ఫ్ #ప్రతినిధి #మండా #వర్జిల్ #బాబు #అందించిన #సమాచారం #ప్రకారం
దోహా:పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపర్రు గ్రామానికి చెందిన నల్లి రత్నరాజు( 51) అనారోగ్య కారణాల వలన 15 రోజుల క్రితం ఖతార్ లో మృతి చెందినారు.రత్నం రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖతార్ లోని APNRTS కో-ఆర్డినేటర్, మరియు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ధీరజ్, ICBF మెంబెర్ రజనీ మూర్తి తో మాట్లాడి ఎమిగ్రేషన్ మరియు పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించారు.బాడి బాక్సు విమాన టికెట్ ఖర్చులు,రాయబార కార్యాలయం వారు సమకూర్చారు. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ద్వారా, మృతదేహం హైదరాబాద్ కు పంపండం జరిగింది. ఖతార్ రాయబార కార్యాలయం వారికి మండా వర్జీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మృతుని స్వస్థలం చంద్రపర్రు గ్రామానికి బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) సహకారంతో, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించినారు.
మండా, వర్జిల్ బాబు మాట్లాడుతూ, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించిన మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్),బి.హెచ్ ఇలియాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మృతదేహం స్వస్థలం చేరింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







