దుబాయ్:ఎమిరేట్స్ లోటో వీక్లి ర్యాఫిల్ డ్రా ఈ ఏడాది ఆఖరికి వాయిదా

- July 18, 2020 , by Maagulf
దుబాయ్:ఎమిరేట్స్ లోటో వీక్లి ర్యాఫిల్ డ్రా ఈ ఏడాది ఆఖరికి వాయిదా

దుబాయ్:తొలి ఫత్వా అనుమతి పొందిన లక్కీ డ్రా నిర్వాహకులు తమ వినియోగదారుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి వారం నిర్వహించే లక్కీ డ్రాను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో తిరిగి డ్రా నిర్వహణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే..తిరిగి డ్రా నిర్వహించే అంశంపై ఎమిరేట్స్ లోటో నిర్వాహకులు ఎలాంటి స్పష్టమైన తేది ప్రకటించలేదు. ఇక ఈ వారానికి సంబంధించి లక్కీ డ్రా టికెట్లను ఖరీదు చేసిన కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు మాత్రం వెల్లడించారు. అయితే..ఎమిరేట్స్ లోటో లక్కీ డ్రాను మరింత సమర్ధవంతంగా, వినియోదారులకు సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ప్రస్తుతానికి డ్రాలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com