పాతికేళ్ళ యువకులకు క్యాబినెట్‌లో చోటు

- February 04, 2016 , by Maagulf
పాతికేళ్ళ యువకులకు క్యాబినెట్‌లో చోటు

యూఏఈ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌ మరియు దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, ట్విట్టర్‌ ద్వారా సంచలన ప్రకటన చేశారు. క్యాబినెట్‌లోకి గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన ముగ్గురు యువకుల్ని, ముగ్గురు యువతుల్ని యూనివర్సిటీలు నామినేట్‌ చేయవచ్చని, వారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు షేక్‌ మహమ్మద్‌. యువత దేశానికి వెన్నెముక అనీ, వారి ఆలోచనలు దేశాభివృద్ధికి ఉపయోగపడ్తాయని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పాతికేళ్ళలోపువారికి ఈ అద్భుత అవకాశం దక్కనుంది. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ మరియు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ది నాలెడ్జ్‌ మరియు హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ కరమ్‌ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. దేశ అభివృద్ధిలో ఇదో కీలకమైన ముందడుగుగా ఆయన కొనియాడారు. షేక్‌ మహమ్మద్‌ నిర్ణయంపై యువత నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని యువత ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com