ఆన్ లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తం..యూఏఈ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక
- July 22, 2020
యూఏఈ:బ్యాంకర్ల పేరుతో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది. కరోనా కారణంగా ఇటీవల డిజిటల్ బ్యాంకింగ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే..ఇదే అదనుగా ఆన్ లైన్ మోసగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఖతాదారులను నమ్మించి వారి అకౌంట్ వివరాలు తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తోంది. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఎవరూ ఫోన్ చేసిన అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని సూచించింది. అలాగే మేసేజ్ లు పంపించిన అనుమానిత లింకులు పంపించినా స్పందించొద్దని పేర్కొంది. యూఏఈలోని బ్యాంకులు తమ వినియోగదారుల సమాచారం కోరుతూ ఎవరికీ ఫోన్ లు చేయవని..ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరింది. సెంట్రల్ బ్యాంక్ పేరు, లోగోతో నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష