రియాద్:నిలకడగా కింగ్ సల్మాన్ ఆరోగ్యం
- July 22, 2020
రియాద్:కింగ్ సల్మాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. సౌదీలో రెండు పవిత్ర మసీదుల పోషకుడైన కింగ్ సల్మాన్ అనారోగ్య కారణంగా గత సోమవారం రియాద్ లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గాల్ బ్లాడర్ లో సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. అయితే..అది ఏమంత ప్రమాదకరమైన సమస్య కాదని తెలిపినట్లు సమాచారం. కింగ్ సల్మాన్ ఆస్పత్రిలో చేరిన విషయం బయటికి తెలియగానే సౌదీలోని వివిధ రాష్ట్రాల పాలకులు ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కింగ్ సల్మాన్ శ్రేయోభిలాషులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ట్వీట్లు చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష