ఎఫ్‌ఎహెచ్‌ఇఎస్‌ కేంద్రాల్లో వాహనాల తనిఖీలు వచ్చే నెల నుంచి పునఃప్రారంభం

- July 23, 2020 , by Maagulf
ఎఫ్‌ఎహెచ్‌ఇఎస్‌ కేంద్రాల్లో వాహనాల తనిఖీలు వచ్చే నెల నుంచి పునఃప్రారంభం

దోహా:ఎఫ్‌ఇహెచ్‌ఇఎస్‌ కేంద్రాలు, ఆగస్టు నుంచి తిరిగి పూర్తిస్థాయిలో సాధారణ కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ట్రాఫిక్‌ విభాగంతో కలిసి పూర్తిస్థాయిలో అన్ని కార్యకలాపాల్ని పునఃప్రారంభించనున్నామని, ఇవి ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్ని భారీ వాహనాల తనిఖీలు ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఎఫ్‌ఎహెచ్‌ఇఎస్‌ కేంద్రం వద్ద (మర్జౌవా) జరుగుతాయి. భౌతిక తనిఖీలపై ఇప్పటిదాకా విధించిన నిషేధం ఆగస్టు 1తో ముగుస్తుంది. జులై 31 తర్వాత రిజస్టర్‌ చేసుకున్న వారికి ఎఫ్‌ఎహెచ్‌ఇఎస్‌ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com