నివాసితులందరికీ ఉచిత కోవిడ్-19 పరీక్షలు
- July 23, 2020
అజ్మన్:అజ్మన్ నివాసితులు కరోనా వైరస్ (కోవిడ్ 19) పరీక్షల్ని జులై 23 నుంచి ప్రత్యేక కేంద్రం వద్ద చేయించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అల్ బయిత్ మెతవ్వాహిద్ హాల్లో రోజుకి 2,000 మందికి ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు. అజ్మన్ మెడికల్ జోన్ డైరెక్టర్ హమాద్ తారిం అల్ షామ్సి మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో వుండేలా ఈ కేంద్రాన్ని నిర్ణయించినట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరచి వుంటుంది. ఉచితంగా ఎక్కువమందికి పరీక్షలు చేయడంలో అబుధాబి, షార్జాలను అజ్మన్ అనుసరిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో యూఏఈ ఆదర్శంగా నిలుస్తోంది. యూఏఈలో ఇప్పటికే 4.5 మిలియన్ కరోనా టెస్టులు చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







