ప్రభుదేవాతో నువ్వు చేసిందేమిటి: నయనతారపై విరుచుకుపడ్డ వనిత
- July 23, 2020
సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో వివాహం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను వివాహం చేసుకున్న పీటర్ పాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ సీనియర్లు లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి లాంటి వారు వనిత మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై వనిత కూడా విమర్శలపై వనిత కూడా ఘాటుగానే స్పందించింది.
సోషల్ మీడియా వేదికగా తన మీద విమర్శలు చేసిన వారిపై పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చింది వనిత తాజాగా ఈ వివాదంలోకి నయనతారను కూడా లాగింది వనిత. `గతంలో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా? అప్పుడు కనీసం మాట కూడా మాట్లాడలేని వారు ఇప్పుడెందుకింత రచ్చ చేస్తున్నారని వనిత ప్రశ్నించింది.
అయితే ఈ సందర్భంగా వనిత వాడిన భాష తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. కొన్ని అసభ్య పదాలు వాడటంతో నయనతార అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా వనిత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనిత మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ దెబ్బతో వనిత తన ట్విటర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు