యూ.ఏ.ఈలో సెప్టెంబర్ 19 నుంచి IPL ప్రారంభం
- July 24, 2020
న్యూ ఢిల్లీ:క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న IPL-2020 నిర్వహణకు సంబంధించి చైర్మన్ బ్రిజేష్ పాటిల్ పలు కీలక విషయాలను వెల్లడించారు.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొత్తం 8 టీంలు లీగ్ బరిలో నిలుస్తాయని, నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘కరేబియన్లీగ్ సెప్టెంబర్ 10 ముగుస్తుంది. అలాగే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీస్ అదే నెల 15న ముగియనుంది. ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్ తెలిపారు.దీనిపై బీసీసీఐ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.మొత్తం 51 రోజుల పాటు లీగ్‌ను నిర్వహించే విధంగా షెడ్యూల్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్ పాటిల్ మీడియాతో మాట్లాడారు.
టీ-20 ప్రపంచ్ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్‌ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే రూ.4వేల కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుందని లెక్కలేసిన బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయంతో ఆ సమయంలో లీగ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







